క్యాటరింగ్ బిజినెస్​లో ట్రాన్స్​జెండర్ టీమ్ సెక్సెస్​ స్టోరీ

Transgender Catering Business In Tamilnadu : సమాజంలో ట్రాన్స్ జెండర్లపై ఉండే చిన్నచూపు అంతా ఇంతా కాదు! అయితే వారు కూడా తామేం తక్కువ కాదని నిరూపించుకున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే తమిళనాడుకు చెందిన ఓ ట్రాన్స్ జెండర్, క్యాటరింగ్ బిజినెస్​లో దూసుకెళ్తోంది. అంతేకాకుండా తనలాంటి వాళ్లని చేరదీసి, వంటల్లో మెలకువలు నేర్పుతూ ఆత్మస్థైర్యంతో ముందుకుసాగేలా చేస్తోంది. ఇలా ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న తమిళనాడుకు చెందిన ట్రాన్స్​జెండర్​పై ప్రత్యేక కథనం.

Transgender Catering Business In Tamilnadu : ట్రాన్స్‌జెండర్లంటే సమాజంలో ఒక రకమైన చిన్నచూపు. ఛీత్కారాలు! చాలా మంది కుటంబ సభ్యుల ఆదరణకూ నోచుకోరు! అయితే ఇలాంటి అవమానాలు, అవాంతరాలు అన్నింటినీ దాటుకుని తన కాళ్ల మీద తాను నిలబడమే కాకుండా, తనలాంటి వాళ్లను ఆత్మస్థైర్యంతో ముందుకు సాగేలా చేస్తోంది ఓ ట్రాన్స్​జెండర్. ఆమే క్యాటరింగ్ బిజినెస్​లో దూసుకెళ్తున్న ‘సెల్వీ అమ్మ’. తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన సెల్వీ, ఆమెతో నడిచిన 40మంది ట్రాన్స్​జెండర్ల టీమ్​ వారి అనుభవాలను “ఈటీవీ భారత్​”తో షేర్​ చేసుకున్నారు.

‘అమ్మ’గా వండి పెడుతోంది
కోయంబత్తూరుకు చెందిన సెల్వీ(50) అనే ట్రాన్స్​జెండర్​ క్యాటరింగ్ బిజినెస్​లో దూసుకుపోతోంది. అందరితో ‘సెల్వీ అమ్మ’ అనిపించుకునే స్థాయికి ఎదిగింది. అయితే ఈ విజయం సెల్వీకి అంత సులువుగా దక్కలేదు. తాను కూడా అందరు ట్రాన్స్​జెండర్ల లాగానే అనేక సవాళ్లను ఎదుర్కొంది. సమాజంలో తమలాంటి వారిపై ఉన్న చిన్నచూపు, ఛీత్కారాలను దాటి, తాను కూడా ఏదైనా సాధించాలనే పట్టుదలతో కష్టపడింది. ఈ క్రమంలో వంటల్లో, ముఖ్యంగా బిర్యానీ చేయడంలో మెలకువలు నేర్చుకుని ఆరితేరింది. అందులో ముఖ్యంగా సెల్వీ అమ్మ చేసే, ‘రవ్​తర్’​ బిర్యానీ చాలా ఫేమస్​. ఫలితంగా, పొరుగు రాష్ట్రం కేరళ నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. చాలా మంది తమ ఇంటి కార్యక్రమాల కోసం సెల్వీ అమ్మ చేత వంట చేయించుకోవడానికి నెలల తరబడి నిరీక్షిస్తున్నారంటే అతిశయోక్తి కాదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *