డ్రైవింగ్‌లో డ్రైవర్‌కు గుండెనొప్పి… చికిత్స పొందుతూ మృతి

డ్రైవింగ్‌లో డ్రైవర్‌కు గుండెనొప్పి..

  • చికిత్స పొందుతూ మృతి
  • ముందుగానే అప్రమత్తం కావడంతో తప్పిన ముప్పు

పీపుల్స్‌డైరీ-సైదాపూర్‌ : డ్యూటీలో ఉండగానే ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో కండక్టర్‌కు చెప్పి అప్రమత్తం చేసి బస్సును నిలిపివేయడంతో ప్రమాదం తప్పగా డ్రైవర్‌ మాత్రం చికిత్స పొందుతూ మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి… సైదాపూర్‌ మండలంలోని దుద్దెనపల్లి గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ ఠాగూర్‌ రమేశ్‌ సింగ్‌(46) ఆదివారం హుజురాబాద్‌ నుండి హైదరాబాద్‌ వెళ్తుండగా మార్గమధ్యలో గజ్వేల్‌ ప్రాంతంలో సదరు డ్రైవరు చాతిలో నొప్పి వస్తుందని ప్రయాణికులకు తెలియజేయడంతో అప్రమత్తమైన తోటి కండక్టర్‌, ప్రయాణికులు డ్రైవర్‌ రమేశ్‌ను 108 వాహనంలో స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడు రమేశ్‌ సింగ్‌కు భార్య తోపాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇటీవలే పరకాల డిపో నుంచి హుజురాబాద్‌ డిపోలో చేరారు. విధి నిర్వహణలో ఆర్టీసీ ఉద్యోగి మృతి చెందడం పట్ల అతని కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఆర్టీసీ ఉద్యోగులు రమేశ్‌ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *