కేంద్ర మంత్రిని కలిసిన బీజేపీ నల్లబెల్లి మండల నాయకులు.
పీపుల్స్ డైరీ – నల్లబెల్లి : కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ ని నల్లబెల్లి బీజేపీ మండల అధ్యక్షులు బొద్దిరెడ్డి ప్రతాప్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి తడుక వినయ్ గౌడ్,యువమోర్చ మండల అధ్యక్షులు గుగులోతు తిరుపతి, మండల నాయకులు గుర్రపు నరేష్ కరీంనగర్ లో మర్యాదపూర్వకంగా కలిసి కేంద్ర ప్రభుత్వ పథకాలు పేద,మధ్యతరగతి ప్రజలకు అందకుండా కొంతమంది అధికారులు అడ్డుపడుతున్నారని వారిపై చర్యలు తీసుకునే విధంగా చూడాలని తెలిపారు.