ఇక వాటికి తాళాలే..!!

ఇక వాటికి తాళాలే..!!

‘పీపుల్స్‌ డైరీ’ బ్రేకింగ్‌

  • విసిగి వేసారిన గురుకుల ప్రైవేటు అద్దె భవనాల యజమానులు
  • అద్దె చెల్లించండి మొర్రో అంటున్న పట్టించుకోని ప్రభుత్వం
  • తాళాలు వేయటానికి సిద్ధంగా ఉన్న యజమానులు
  • రాష్ట్రం మొత్తం ఏకమైన భవనాల ఓనర్లు
  • రూ.500 కోట్ల బకాయి పడ్డట్టు సమాచారం

పీపుల్స్‌డైరీ ప్రతినిధి, వరంగల్‌ :
నెలల తరబడి ప్రభుత్వం అద్దె చెల్లించకపోవడంతో విసిగి వేసారి పోయారు గురుకుల పాఠశాలల ప్రైవేటు అద్దె భవనాల యజమానులు. ఒకటి కాదు రెండు కాదు కొన్ని చోట్ల 30 నెలల వరకు బకాయిలు పెండింగ్లో ఉన్నట్టు భవన యజమానులు పేర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్ లో ఉన్న అద్దె సుమారు రూ.500 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఇప్పటికే వరంగల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ ఉర్సుగుట్ట బీసీ హాస్టల్‌కి సదరు యజమాని తాళాలు వేశారు. గతనెల 20వ తేదీన ఉన్నతాధికారులకు భవన యజమానులు తమ సమస్యను పరిష్కరించాలని వినతిపత్రం కూడా అందజేశారు. దసరా సెలవులు ప్రారంభ సమయానికి తమ సమస్యలు పరిష్కరించకపోతే తాళాలు వేస్తామని కూడా అప్పుడే హెచ్చరించడం జరిగింది. అయితే ప్రభుత్వం ఈ విషయంలో స్పందించకపోవడంతో ఆయా భవనాలకు తాళాలు వేసేందుకు యజమానులు సిద్దమయ్యారు.

(పూర్తి వివరాలు రేపటి సంచికలో)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *