‘అశోక’చక్రం తిప్పుతున్న క్లర్క్
- బల్దియా సిబ్బందిపై పెత్తనం
- ఓ ప్రజా ప్రతినిధి సీసీ అతి…
- ప్రజా ప్రతినిధికి తెలియకుండానే పనులు కానిచ్చేస్తున్న క్యాంప్ క్లర్క్
- దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుపడ్డట్టు అయన ప్రవర్తన
- బల్దియాలో తాత్కాలిక ఉద్యోగుల బదిలీల్లో కీలక పాత్ర పోషిస్తున్న అతడు
- అధికారులకు ఫోన్‌లోనే ఆర్డర్లు వేస్తూ పనులు చక్కబెడుతున్న వైనం
- కార్యాలయంలో సిబ్బందిని పీల్చి పిప్పి చేస్తున్నాడని గగ్గోలు
- గతంలో ఈయన ప్రవర్తనకు ఓ డ్రైవరు ఆత్మహత్య?
- విధులకు ఆటంకాలు కలిగిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపణ
పీపుల్స్ డైరీ, వరంగల్ ప్రతినిధి
గ్రేటర్ వరంగల్ నగరంలో ఓ ప్రజా ప్రతినిధి క్యాంప్ కార్యాలయంలో క్యాంప్ క్లర్క్ (సీసీ) గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి కార్యాలయంలోనే చక్రం తిప్పుతున్నట్టు తెలిసింది. బల్దియాలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులపై పెత్తనం చెలాయిస్తూ వారి బదిలీల్లో కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. అధికారులకు సైతం ఫోన్లోనే ఆర్డర్లు వేస్తూ సదరు ప్రజా ప్రతినిధికి తెలియకుండానే చక్రం తిప్పుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఈ సీసీ ప్రవర్తనతో ఓ డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డట్టు కూడా ప్రచారం సాగుతుంది. ప్రజా ప్రతినిధిని కలవాలన్నా ఈయన గారిని ప్రసన్నం చేసుకోవాల్సిందే. లేదంటే కలవనివ్వకుండా బయట నుండి బయటకే పంపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి తతంగాలకు పాల్పడుతున్న వారితో ప్రజలకు సేవలందించే ప్రజా ప్రతినిధులపై ప్రభావం చూపుతుందని, వారి రాజకీయ భవిష్యత్తుకు మాయని మచ్చలా తయారవుతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా బల్దియాలో సిబ్బందిపై పెత్తనం చెలాయిస్తూ ఉద్యోగాల్లో చిచ్చు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
పూర్తి వివరాలు రేపటి “పీపుల్స్ డైరీ” సంచికలో…..