పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

  • పోలీస్ అమరవీరుల సంస్మరణలో రక్తదాన శిబిరం
  • శిబిరాన్ని ప్రారంభించిన నర్సంపేట ఈస్ట్ జోన్ డిసిపి రవీందర్

నల్లబెల్లి : విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని పోలీస్అధికారులు కొనియాడారు.పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని పలు చోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సోమవారం నర్సంపేట పట్టణంలోని సిటిజన్స్ క్లబ్ లో రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో 120 మంది పాల్గొని రక్తదానం చేశారు.పోలీసుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని నర్సంపేట ఈస్ట్ జోన్ డిసిపి రవీందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రక్తదానం ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ప్రాణదానం లాంటిదని పేర్కొన్నారు. ప్రతి రెండు సెకన్లకు ఎవరికో ఒకరికి అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరం ఉంటుందని, రక్తదానం ప్రాణదానంతో సమానం మీరొక్కరు ఇచ్చే రక్తం ఎక్కువ మంది ప్రాణాలను నిలబెడుతుందని, అందుకే ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలివాలని అది సకాలంలో అందకపోవడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని గుర్తు చేశారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందురావాలని ఆయన కోరారు. శిబిరంలో 120 రక్త దానం చేయగా వారి నుంచి 120 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు తెలిపారు. సమాజం కోసం, దేశం కోసం, రేపటి తరాల మంచి భవిష్యత్తు కోసం ప్రాణత్యాగాలు చేశారని వారి త్యాగాలను వెలకట్టలేమన్నారు. ప్రతీ ఒక్కరూ పోలీసు అమరవీరుల త్యాగాలను నిత్యం స్మరించుకోవాలన్నారు. పోలీసు అమరుల త్యాగ ఫలితమే మనమంతా ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నారు. మెరుగైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా పనిచేసినప్పుడే వారు త్యాగానికి మనమందించే ఘనమైన నివాళి అని తెలిపారు. అదేవిధంగా రక్తదానం చేయడం ద్వారా ఇతరుల ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతామని ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని కోరారు శిబిరంలో పోలీసులతోపాటు స్థానిక యువకులు 120 మంది పాల్గొనడం అభినందనీయమన్నారు. అనంతరం రక్తదానం చేసిన వారికి ప్రశంసాపత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఎసిపి కిరణ్ కుమార్, దుగ్గొండి సీఐ సాయి రమణ, నెక్కొండ సీఐ రాజగోపాల్ , నర్సంపేట సీఐ రమణమూర్తి , నల్లబెల్లి ఎస్ఐ ప్రశాంత్ బాబు , కానిస్టేబుల్స్‌, జర్నలిస్టులు,విద్యార్థులు, నల్లబెల్లి మండల ప్రజలు రక్తదానం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *