ఘనంగా నాగులచవితి
నల్లబెల్లి – నాగులచవితి సందర్భం గా మంగళవారం మండల వ్యాప్తంగా నాగులచవితి వేడుకలను మహిళలు ఘనంగా చేసుకున్నారు. నాగుల చవితిన పుట్టలో పాలు పోస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. సౌభాగ్యానికి, సంతానప్రాప్తికి సర్పపూజ చేయడం అనాదిగా వస్తున్న సంప్రదా యం. కుజ, రాహుదోషాలున్నవారు, సాంసారిక బాధలున్నవారికి శుభం కలుగుతుందనే నమ్మకం. మహిళలు మంగళకరంగా స్నానమాచరించి పుట్టలో పాలుపోసి నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే సమీప పుట్టల వద్దకు వెళ్లి పాలు పోసి పుట్ట చుట్టూ పసుపు దారాలతో అల్లిక లు వేసి కొత్త బట్టలు సమర్పించి నువ్వుల ముద్ద, చలిమిడి పిండి ప్రసాదంగా అందజేశారు మండలంలోని అభయ నాగేంద్ర స్వామి దేవాలయం వద్ద పుట్ట వద్ద మహిళలు ప్రత్యేక పూజలు గావించారు .నాగదేవతకు పెట్టిన ప్రసాదాన్ని చిన్న పిల్లలకు పంచిపెట్టించారు.