టెన్త్ పరీక్షల ఫీజు షెడ్యూల్ రిలీజ్
నవంబర్ 18.. చివరి తేదీ
పీపుల్స్‌డైరీ`హైదరాబాద్ : తెలంగాణలో పదవ తరగతి పరీక్షల ఫీజు షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్ధులకు వచ్చే మార్చిలో జరిగే పబ్లిక్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. నవంబర్ 18వ తేదీలోగా ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా పరీక్షల ఫీజు చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ తెలిపారు. పరీక్షల ఫీజును రూ.125గా నిర్ణయించామన్నారు. కాగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 5.25 లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు సమాచారం.