అరుదైన ఘటన…

  • చలనం లేకుండా పుట్టిన శిశువు
  • మృతిచెందినట్టు నిర్ధారించిన వైద్యులు
  • 7 గంటల తర్వాత బతికిన శిశువు
  • విశాఖపట్నంలో ఆశ్చకర ఘటన

పీపుల్స్‌డైరీ`విశాఖపట్నం : డెలివరీ కోసం వెళ్లిన ఆ దంపతులకు చలనం లేకుండా శిశువు జన్మించాడు. ఎంతో ఆనందకరమైన ఆ సమయంలో శిశువు ఊపిరి లేకపోవడంతో ఆ దంపతులు విలవిలలాడిపోయారు. ఇక ఆ బాబు చనిపోయాడని వైద్యులు కూడా నిర్దారించారు. ఇక ఆ విషాద సమయంలో 7 గంటల తర్వాత బాబులో కదలిక కావడంతో ఆ దంపతుల్లో ఆనందం వెల్లివిరిసింది. వివరాల్లోకి వెళితే… విశాఖ కేజీహెచ్‌ ఆసుపత్రిలో ఈ అరుదైన ఘటన జరిగింది. ఎటువంటి చలనం లేకుండా ఉండంటం, ఊపిరి కూడా లేకపోవటంతో చనిపోయాడని డిసైడ్‌ అయ్యారు. అయితే ఆశ్చర్యకరంగా పుట్టిన 7 గంటల తర్వాత శిశువులో చలనం వచ్చింది. విశాఖ కేజీహెచ్‌లో శుక్రవారం రాత్రి 9 గంటలకి చలనం లేకుండా శిశువు జన్మించగా.. డాక్టర్లు రాత్రంతా రాత్రంతా శ్రమించారు. అయినా శిశువులో ఎటువంటి చలనం కనిపించలేదు. దీంతో శిశువు మృతిచెందినట్లు హాస్పిటల్‌ సిబ్బంది రికార్డ్స్‌లో ఎంట్రీ చేశారు. అనంతరం శిశువును సిబ్బంది తండ్రికి అప్పగించారు. శిశువును అంబులెన్స్‌లోకి ఎక్కిస్తున్న సమయంలో తండ్రి చేతుల్లోని శిశువులో కదలిక గమనించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. శిశువుకి వైద్యం చేశారు. శిశువు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు ప్రకించారు. చనిపోయాడని భావించిన శిశువు బతికే ఉండటంతో ఆనందంతో కంటతడి పెట్టుకున్నాడు.
విశాఖపట్నంలోని ఒక కాలనీకి చెందిన గర్భిణీ పురిటి నొప్పులతో గతరాత్రి కేజీహెచ్‌ గైనకాలజీ వార్డులో చేరారు. డాక్టర్లు సిజేరియన్‌ చేసి గర్బిణీకి ప్రసవం చేశారు. మగబిడ్డ జన్మించినప్పటికీ బరువు తక్కువగా ఉంది. శిశువులో ఎటువంటి చలనం లేదు. దీంతో అవసరమైన వైద్య సేవలను డాక్టర్లు అందించారు. శనివారం తెల్లవారుజాము వరకు ప్రయత్నించినా ఉపయోగం లేదు. దానికి తోడు శిశువు ఊపిరి ఆగిపోయింది. విధుల్లో ఉన్న డాక్టర్లు శిశువును పరిశీలించి.. చనిపోయినట్లు నిర్ధారించారు. హాస్పిటల్‌ రికార్డుల్లోనూ శిశువు మృతి చెందినట్లు నమోదు చేశారు. అనంతరం శిశువును కుటుంబ సభ్యులకు అందించగా.. తండ్రి కన్నీటి పర్యంతమయ్యాడు. శిశువును ఇంటికి తీసుకెళ్లి ఖననం చేసేందుకు అంబులెన్స్‌ ఏర్పాటు చేసుకున్నారు. అంబులెన్స్‌లో ఎక్కే సమయంలో తండ్రి చేతుల్లోని శిశవులో కదలికలను కుటుంబ సభ్యులు గమనించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *