- భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భీకర పోరు
- అబూజ్మాద్‌లో భద్రతా బలగాల మేజర్ ఆపరేషన్
- ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టు మృతి?
- ఇంకా కొనసాగుతున్న ఎన్‌కౌంటర్
- మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్
- ఇద్దరు జవాన్లకు గాయాలు
చర్ల, నవంబర్ 16 (పీపుల్స్‌డైరీ) : చర్ల మండల సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్, కంకేర్ జిల్లాల్లోని అబుజ్మద్ ప్రాంతంలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భీకర ఎన్‌కౌంటర్ జరుగుతోంది. శనివారం ఉదయం నుంచి ఈ ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. మహారాష్ట్రకు చెందిన సి-60 కమాండోలతో కలిసి కంకేర్-నారాయణపూర్ జిల్లా పోలీసులు నిర్వహించిన అతిపెద్ద ఆపరేషన్‌గా ఇది తెలుస్తోంది. ఎన్‌కౌంటర్‌లో పలువురు మావోయిస్టు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. పోలీసులు ఇప్పటివరకు ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం రెండు వైపుల నుండి అడపాదడపా కాల్పులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇద్దరు సైనికులు గాయపడినట్లు కూడా సమాచారం. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు అభయ్‌ను చుట్టుముట్టేందుకు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన భద్రతా దళాల ఉమ్మడి పార్టీ ఈ ఆపరేషన్‌ను ప్రారంభించింది. అభయ్ సమీపంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు సమావేశమైనట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. ఎన్‌కౌంటర్‌ను కాంకేర్ ఎస్పీ ఐకె ఎలిసెలా ధృవీకరించారు. గాయపడిన సైనికులను అటవీ ప్రాంతం నుంచి రక్షించేందుకు వీI17 హెలికాప్టర్‌ను పంపారు. గాయపడిన సైనికులను వీI 17 హెలికాప్టర్‌ను అడవిలోనే ల్యాండ్ చేసి రాయ్‌పూర్‌కు పంపనున్నట్లు సమాచారం.