మహిళలు మౌనం వీడి షీటీంకు ఫిర్యాదు చేయండి.. పోలీస్‌ కమిషనర్.

మహిళలు మౌనం వీడి షీటీంకు ఫిర్యాదు చేయండి.. పోలీస్‌ కమిషనర్.

హనుమకొండ:  మహిళలు ఎక్కడైనా లైంగిక వేధింపులకు గురౌవుతుంటే మౌనం పాటించకుండా ధైర్యంగా షీ టీంకు ఫిర్యాదు చేయాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ మహిళలు, విద్యార్థినులకు పిలుపునిచ్చారు. వివిధ ప్రదేశాల్లో మహిళలు ఏవిధమైన లైంగిక వేధింపులకు గురౌవుతున్నారు. తక్షణమే సదరు బాధిత మహిళలు స్పందించాల్సిన తీరు పై మహిళలకు అవగాహన కల్పించేందుకు గాను తెలంగాణ మహిళ రక్షణ విభాగం నూతనంగా రూపొందించిన వాల్‌పోస్టర్లను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ శుక్రవారం అవిష్కరించారు. ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ మహిళలు బాలికల రక్షణ కై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోంది.అలాగే మహిళల పై లైంగిక దాడులకు పాల్పడిన పట్ల కూడా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రధానంగా మహిళలు, బాలికలు, అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా వుండాలని, మీ వ్యక్తిగత సమాచారాన్ని వారితో పంచుకోవద్దని. ముఖ్యంగా సామాజిక మాద్యమాల్లో పరిచయమయ్యే వ్యక్తులతో మరింత అప్రమత్తం వుండాలని అన్నారు. మహిళల భద్రత కోసమే షీ టీం లేదా డయల్‌ 100 సమాచారం ఇవ్వాలిందిగా పోలీస్‌ కమిషనర్‌ మహిళలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పరిపాలన విభాగం అదనపు డీసీపీ రవి, స్పెషల్‌ బ్రాంచ్‌ ఏసీపీ జితేందర్‌ రెడ్డి, వరంగల్‌ షీ టీం ఇన్స్‌స్పెక్టర్‌ సుజాతతో పాటు షీ టీం సిబ్బంది పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *