ఎమ్మెల్యే సొంత ఊర్లో… మహిళకు ఎంత కష్టం…
– 15 ఏళ్లుగా కరెంటు తాగునీరు నడవడానికి దారి లేక జీవనం గడుపుతున్న బుద్ధారం కాలనీవాసులు
– ఎమ్మెల్యేగా గెలిచి సంవత్సరం పూర్తిగా వస్తున్న తమ సొంత ఊరిని పట్టించుకోని వైనం
పీపుల్స్ డైరీ, నిఘా టీం: గణపురం మండలంలోని బుద్ధారం గ్రామంలో ఓ మహిళకు చెప్పుకోలేనంత కష్టం వచ్చింది. ఆ గ్రామం భూపాలపల్లి ఎమ్మెల్యే సంత గ్రామం గత 15 ఏళ్లుగా తమ కాలనీకి త్రాగునీరు కరెంటు నడవడానికి రహదారి లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గత 20 ఏళ్లుగా ప్రజాప్రతినిగానే ఉంటున్నాడు. అయినప్పటికీ తమ సొంత గ్రామంలో ఉన్న ప్రజల బాధలను పట్టించుకోకుండా ఉండడంతో బుద్ధారం గ్రామ ప్రజలు ఏం చేయాలో తోచక ఆదివారం రోడ్డు ఎక్కారు. వివరాల్లోకి వెళితే తమ కాలనీకి త్రాగునీరు, కరెంటు సరఫరా, రహదారి లేక గత 15 ఏళ్లుగా అనేక రకాలుగా ఇబ్బందులను పడుతున్నామని కాలనీ ప్రజలు ఎండి సుల్తాన్ బీ, పౌడాల కృష్ణస్వామిలు ఆవేదన వ్యక్తం చేశారు.
గణపురం మండలం బుద్దారం గ్రామంలో ప్రజా సమస్యలైన ఇంటికి నల్లా కనెక్షన్, కనీస రోడ్డు సౌకర్యం, విద్యుత్ కనెక్షన్ సదుపాయాలు కల్పించాలని గ్రామ పంచాయతీ సిబ్బందికి ఆదివారం ఎం డీ సుల్తాన్ బీ, పౌడాల కృష్ణ స్వామి. సీఐటీయూ నాయకులు దాసరి నితీష్, నర్సింగ్ లు. జిపి సిబ్బందికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సుల్తాన్ బీ, కృష్ణ స్వామిలు మాట్లాడుతూ బుద్దారం గ్రామంలో 15ఏండ్ల నుండి బుద్ధారంలో నివసిస్తున్నామని, అయినప్పటికీ తమ ఇంటింటికి నల్లా కనెక్షన్, రోడ్డు, విద్యుత్ సదుపాయాలు తక్షణమే కల్పించాలని కోరారు. అనంతరం సీఐటీయూ నాయకులు నితీష్, నర్సింగ్ లు మాట్లాడుతూ సామాన్య ప్రజలు ఎన్నో ఏండ్లుగా పాలకులకు, అధికారులకు విన్నపాలు చేసినా వాటిని బుట్టధాకలు చేసారని, ఇకనైనా అధికారులు, నాయకులు పెడ చెవిన పెట్ట కుండా తక్షణమే మిషన్ భగీరథ కనెక్షన్ సదుపాయం కల్పించి నీటి గోసల నుంచి ఆ కుటుంబాలను కాపాడాలని డిమాండ్ చేశారు, రోడ్డు సౌకర్యం, విద్యుత్ వసతి ఏర్పాటు చేయాలన్నారు. సమస్యలు తీరక పోతే ఎంపీడీఓ, కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు.