అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నియోజకవర్గం వ్యాప్తంగా కార్లతో భారీ “భారత రాజ్యాంగ పరిరక్షణ యాత్ర”

అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నియోజకవర్గం వ్యాప్తంగా కార్లతో భారీ “భారత రాజ్యాంగ పరిరక్షణ యాత్ర”

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు ఘనంగా నివాళులర్పించిన అంబేద్కర్ వాదులు,మేధావులు

భీమదేవర పల్లి నవంబర్ 26 (పీపుల్స్ డైరీ )

హనుమకొండ జిల్లా భీమదేవర పల్లి మండలం హుస్నాబాద్ 75వ రాజ్యాగ దినోత్సవ వేడుకలు హుస్నాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా మంగళవారం ఘనంగా జరిగాయి.హుస్నాబాద్ నియోజకవర్గ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా మంగళవారం కార్లతో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర నిర్వహించారు.ఎల్కతుర్తి మండలంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగానివాళులర్పించారు.
ఎల్కతుర్తి లో ప్రారంభమైన యాత్ర నియోజకవర్గంలోని భీమదేవరపల్లి,అక్కన్నపేట కోహెడ,చిగురుమామిడి, సైదాపూర్ మండల కేంద్రాల్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాయంత్రం నియోజకవర్గ కేంద్రమైన హుస్నాబాద్ లోసాయంత్రం రాజ్యాంగ దినోత్సవ సభను నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్ మాట్లాడుతూ భారతదేశంలో యుగయుగాలుగా రాచరిక పాలన సాగించారన్నారు.200 సంవత్సరాల బ్రిటిష్ పాలనలో స్వదేశంలో సర్వం కోల్పోయి బానిస బతుకులు బతికిన భారతీయులు స్వాతంత్ర్యనంతరం మా దేశం మా పాలనని దృఢ సంకల్పానికి వచ్చి దేశ ప్రజలందరికీ అనుకూలమైన ప్రభుత్వ విధానాన్ని రూపొందించుకోవడానికి ఒక రాజ్యాంగం అవసరం వచ్చిందన్నారు.1946 డాక్టర్ రాజేంద్రప్రసాద్ చైర్మన్ గా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుచేసి 29 ఆగస్టు 1947న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని రాజ్యాంగ రచన కమిటీ చైర్మన్ గా,సభ్యులుగా అల్లాడి కృష్ణస్వామి, అయ్యగారు గోపాలస్వామి, అయ్యంగార్,సయ్యద్ షాదుల్లా ఖాన్,బియన్ మిట్టల్,డిపి ఖతన్ అను ఆరుగురు సభ్యులతో ముసాయిదా కమిటీ ఏర్పడిందన్నారు.వీరిలో కొందరు సొంత పనులతో విదేశాల్లో ఉండగా,ఒకరిద్దరు అనారోగ్యంతో ఉండగా, మిగతావారు రాజకీయాలు పనులకే పరిమితమై ఉండగా, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారతదేశ ప్రజల సంక్షేమం కోసం, దేశ భవిష్యత్తు కోసం, తన అనారోగ్యాన్ని లెక్కచేయకుండా కుటుంబాన్ని సైతం వదిలి ప్రజాస్వామ్య దేశాల రాజ్యాంగాలన్నిటిని చదివి క్షుణ్ణంగా పరిశీలించి రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి ప్రపంచంలోని అతి పెద్ద లిఖిత రాజ్యాంగ ప్రతిని తయారుచేశరన్నారు.తేదీ 26 నవంబర్ లో అప్పటి ప్రభుత్వ పెద్దలైన జవహర్లాల్ నెహ్రూ, రాజేంద్రప్రసాద్,తిలక్,పటేల్ కు సమర్పించినారు.ఇట్టి రాజ్యాంగం చాలా బాగుందని రాజ్యాంగ పరిషత్ లోని దాదాపు 299 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారన్నారు.ఇట్టి రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి దేశంలో అమరుల్లోకి వచ్చింది. అందుకనే ప్రతి సంవత్సరం జనవరి 26న జాతీయ జెండా ఎగురవేసి భారత గణతంత్ర దినోత్సవంగా ఘనంగా జరుపుకుంటున్నమన్నారు. రాజ్యాంగం అమలై 75సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని దేశంలోని అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నప్పటికీ ఈ మధ్య కొందరు మనువాదం, బుజ్జా నాయకులు రాజ్యాంగాన్ని మారుస్తామని బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారన్నారు. రాజ్యాగబద్ధమైన పదవుల్లో ఉండి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే వీరిపై క్రిమినల్ కేసులు పెట్టాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని దేశంలోని కాకుండా విదేశాల్లో కూడా అగ్ర రాజ్యాలైన అమెరికా,బ్రిటన్, రష్యా,మొదలగు వివిధ దేశాల్లో ఘనంగా జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారన్నారు. కావున ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనార్టీ ప్రజలందరూ అప్రమత్తతో ఉండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉన్నదని తెలియజేశారు.అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్,మాజీ జెడ్పిటిసి వంగ రవీందర్,తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శులు కండె సుధాకర్ తొందూరి ఎల్లన్న బహుజన్,మాజీ సర్పంచ్ కండె రమేష్,సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యాక రమేష్,హుస్నాబాద్ నియోజకవర్గం ఎంఆర్పిఎస్ ఇన్చార్జి మాట్ల వెంకటస్వామి, ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు రేణికుంట్ల బిక్షపతి,కడారి బాబు మాడుగుల అశోక్, మాజీ సర్పంచ్ కొమురయ్య, సీనియర్ నాయకులు చెప్యాల ప్రభాకర్,డేగల సారయ్య,మేకల చేరాలు,ఊస కోయిల ప్రకాష్, గజ్జెల రమేష్,కండె సంజీవ్, కండె చక్రపాణి,మాడిశెట్టి కుమారస్వామి,మాణిక్యపూర్ గ్రామ అధ్యక్షుడు తాళ్లపెల్లి ఐలయ్య,ఆశీర్వాదం,జగన్ అరవింద్,చిన్న కొమరయ్య,
ఉప్పుల స్వామి,బొల్లంపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *