తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ ఆత్మహత్య
ములుగు జిల్లా:ములుగు జిల్లాలో వాజేడు మండలం ఎస్ఐ రుద్రారపు హరీష్ ఆత్మహత్య చేసుకున్నారు. పూసూరు గోదావరి బ్రిడ్జి సమీపంలోని ఫెరిడో రిసార్ట్స్‌లో తుపాకితో కాల్పుచుకుని చనిపోయారు. ఆదివారం ఉదయం ఒంటరిగా వెళ్లిన ఎస్ఐ రాత్రి వరకు తిరిగి రాకపోవడంతో వేసి చూసిన స్టేషన్ సిబ్బంది సోమవారం ఉదయం రిసార్డ్స్‌కు వెళ్లి చూడగా హరీష్ విగతజీవిగా కనిపించారు.
ఎస్ఐ నిన్న రిసార్ట్స్‌లో గది అద్దెకు తీసుకుని ఉన్నారు. ఎవరు ఫోన్ చేసిన ఆయన అందుబాటులోకి రాలేదు. ఆయన ఆత్మహత్యకు ఇంట్లో కుటుంబ కలహాలు, వ్యక్తిగత కారణంగా సమాచారం. రిసార్ట్స్ సిబ్బంది ఎన్ని సార్లు డోర్ కొట్టినా తలుపు తెరవలేదు. దీంతో సోమవారం ఉదయం వాజేడు పోలీసులకు సిబ్బంది సమాచారం అందించారు. పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకున్న తర్వాత రిసార్ట్స్ సిబ్బంది డోర్ పగులగొట్టి చూడగా ఎస్ఐ విగతజీవిగా పడి ఉన్నారు
ఇటీవల కాలంలో మావోయిస్టులకు సంబంధించి ఇద్దరు మావోయిస్టు కొరియర్లను హత్య చేయడం ఎస్ఐ హరీష్ పరిధిలోనే జరిగింది. తర్వాత నిన్న జరిగిన ఎన్ కౌంటర్‌కు సంబంధించి అధికారులు ఎస్ఐకు ఫోన్ చేసినా ఆయన స్పందించలేదు. విధుల్లో భాగంగానే ఇంటి నుంచి బయటకు వచ్చిన హరీష్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు.