బాబోయ్‌ దయ్యం!

  • హన్మకొండలోని ఓ హోటల్‌లో క్షుద్రపూజలు
  • దానిని పారదోలేందుకు పూజలా..?
  • భయాందోళనలో బీహార్‌కు చెందిన వర్కర్లు
  • చెప్పాపెట్టకుండా బీహార్‌కు వెళ్లి ఒక వర్కర్‌ ఆత్మహత్య
  • దయ్యం పట్టిన మరో వ్యక్తికి సైలానీబాబా వద్ద వైద్యం చేయించిన యజమాని
  • ఎంటా దెయ్యం కథ… ఎవరా బీహర్‌ వర్కర్లు..??

పీపుల్స్‌డైరీ ప్రతినిధి, వరంగల్‌

పూర్తిగా ఆధునిక కంప్యూటర్‌ టెక్నాలజీలో మునిగితేలుతూ స్మార్ట్‌ యుగంలో జీవిస్తున్న మనుషులు ఇంకా దయ్యాలు, భూతాలు అంటూ ఆందోళన చెందుతూ వాటిని పారదోలేందుకు క్షుద్రపూజలు చేయడం విడ్డూరంగా ఉంటోంది. మనుషుల్లో సంభవించే కొన్ని మానసిక రుగ్మతలకు దెయ్యాలే కారణమనే భ్రమలో పడిపోతుంటారు కొందరు… వివరాల్లోకి వెళితే…
హన్మకొండ నడిబొడ్డున ఒక హోటల్‌లో దెయ్యాలు తిరుగుతున్నాయనే గుబులుతో అక్కడి వర్కర్లు, యజమాని గడగడ వణిపోవడమే కాకుండా వాటిని పారదోలేందుకు క్షుద్రపూజలు చేయడం కలకలం సృష్టించింది. అయితే ఈ హోటల్‌లో బిహార్‌కు చెందిన వర్కర్లు పనిచేస్తున్నారట. అందులో ఒక వ్యక్తి ఉన్నట్టుండి చెప్పాపెట్టకుండా బిహార్‌లోని సొంత ఊరికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడట. ఇక మరో వర్కర్‌కు దెయ్యం పట్టడంతో సైలానీబాబా దర్గాకు తీసుకెళ్లి పూజలు నిర్వహించి దెయ్యాన్ని వదిలించినట్టు ప్రచారం సాగుతోంది. ఇక అంతటితో ఆగకుండా హోటల్‌ నిర్వాహకులు క్షుద్రపూజలు కూడా నిర్వహించినట్టు తెలిసింది.

ఇంతకీ ఆ దెయ్యం కథ సమాప్తం అయ్యిందా…? ఆ హోటల్‌ ఎక్కడ ఉంది…??

పూర్తి వివరాలు పీపుల్స్‌డైరీ దినపత్రిక వచ్చే సంచికలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *