ఘనంగా బి ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకలు
గణపురం ( పీపుల్స్ డైరీ ) : మండలంలోని చెల్పూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని వీరయ్య పల్లి లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం అంబేద్కర్ యువజన నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ… డిసెంబర్ 6న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది అన్నారు. అంబేద్కర్ అందరికీ సమాన విద్య, ఆరోగ్యం, ఉపాధి, రక్షణ, నివాసం, భావ ప్రకటనకు సమ న్యాయం రాజ్యాంగంలో పొందుపరిచిన భారత పిత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. సమ సమాజనిర్మాణంలో బాబాసాహెబ్ ను ప్రపంచ దేశాలు, ఐక్యరాజ్య సమితి “సింబల్ ఆఫ్ నాలెడ్జ్”గా గుర్తించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నడిపెల్లి మధుసూదన్ రావు, పిఎసిఎస్ వైస్ చైర్మన్ కావట్టి రవీందర్, మాజీ సర్పంచ్ కొత్త వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీటీసీ మల్హాలరావ్, చెల్పూర్ గ్రామ కార్యదర్శి హరిశ్చంద్ర రెడ్డి, వీరయ్యపల్లి అంబేద్కర్ యూత్ కమిటీ అధ్యక్షులు పొనగంటి కరుణాకర్, ఉపాధ్యక్షులు పెరుక సారంగపాని, కోశాధికారి అక్కల రాము, ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి గణేష్, సహచార కార్యదర్శి పెరుక రాజుకుమార్, గౌరవ అధ్యక్షులు పొనగంటి ధర్మేందర్, పెరుక కుమారస్వామి, దారకొండ శంకర్, మొగులోజు రవి తదితరులు పాల్గొన్నారు.