- మహబూబ్‌నగర్‌లో జిల్లాలో ప్రకంపనలు
- రిక్టర్ స్కేల్‌పై 3.1గా నమోదు
- భూకంప కేంద్రం దాసరిపల్లి
పీపుల్స్‌డైరీ`మహబూబ్‌నగర్ : ఇటీవల ములుగు జిల్లా కేంద్రంగా భూకంపం సంభవించగా ఇప్పుడు తాజాగా మరోసారి తెలంగాణలో భూమి కంపించింది. మహబూబ్ నగర్ జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ మధ్యాహ్నం సరిగ్గా 12: 10 నిమిషాలకు భూకంపం సంభవించింది. జిల్లాలోని కౌకుంట్ల మండలం దాసరిపల్లి ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. తాజా ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.1గా రికార్డయింది. భూమి కంపించిన వెంటనే జనం తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లల్లో నుంచి బయటకి పరుగులు తీశారు. చాలాసేపటి వరకు ఇళ్లల్లోకి వెళ్లడానికి భయపడ్డారు. రోడ్ల మీదే గడిపారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మొన్నటికి మొన్న భూకంపం రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. ప్రజలను భయాందోళనలకు తీవ్ర గురి చేసింది. ఇళ్ల నుంచి బయటికి పరుగులు పెట్టేలా చేసింది. జనం చాలాసేపటి వరకు రోడ్ల మీదే గడిపాల్సి వచ్చింది. కంపించింది కొన్ని సెకెన్ల పాటే అయినప్పటికీ దాని ప్రభావం జనంపై తీవ్రంగా పడిరది. తెలంగాణలోని ములుగు జిల్లాలో భూకంప తీవ్రత అధికంగా కనిపించి రిక్టర్ స్కేలుపై 5.3గా రికార్డయిన విషయం తెలిసిందే.