పోగొట్టుకున్న ఫోన్ అప్పగింత
నల్లబెల్లి : పోయిన సెల్ ఫోన్‌ను వెతికి పట్టుకున్న పోలీసులు సోమవారం బాధితురాలికి అప్పగించారు. నల్లబెల్లి ఎస్ఐ గోవర్దన్ తెలిపిన వివరాల ప్రకారం..ములుగు జిల్లా ఏటూరు నాగారం గ్రామానికి చెందిన బట్ట ప్రత్యూష నల్లబెల్లి మండలం రెలకుంటలో సెల్ ఫోన్ పోయిందని గత నవంబర్ 22 న నల్లబెల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే సెల్‌ఫోన్ పోగొట్టుకున్న ప్రాంతం వివరాలతో బాధితురాలి పేరు, చిరునామా, గుర్తింపు పత్రం, ఓటీపీ కోసం ఫోన్ నంబర్‌ను ఫిర్యాదులో పొందుపర్చాలని సూచించారు. ఆయా వివరాలతో ఫోర్టల్‌లో నమోదు చేసిన అనంతరం పోగొట్టుకున్న ఫోన్ పనిచేయకుండా బ్లాక్ చేసి, ఎవరు వినియోగిస్తున్నారో గుర్తించేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఐఎంఈఐ (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ) నంబర్ సహాయంతో సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని బాధితుడికి తిరిగి అప్పగించినట్లు తెలిపారు.