మండల ప్రజలకు అందుబాటులో 24/7 ‘108’ సేవలు
పీపుల్స్ డైరీ నల్లబెల్లి
108 ఫోన్ చేసిన వెంటనే కుయ్ కుయ్ అంటూ ఇంటిముందు వాలే 108 అంబులెన్సు వాహనం నల్లబెల్లి మండల కేంద్రానికి ఇటీవల మంజూరి కాగా మంగళవారం మండల ప్రజలకు 108 వాహనం అందుబాటులోకి వచ్చింది దీంతో మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గత నెల నల్లబెల్లి మండలానికి 108 వాహన సేవలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటూ ఏబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బొట్ల నరేష్ గతంలో వరంగల్ జిల్లాలో పనిచేసిన జిల్లా కలెక్టర్ గోపి, అప్పటి జిల్లా వైద్యాధికారి వెంకటరమణలకు వినతిపత్రం సమర్పించడంతో ఆ వినతిపత్రాన్ని సెక్రటరేట్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నర్సింహకు అందజేయడంతో ఈ సమస్యపై దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖ మంత్రి ఇటీవల నల్లబెల్లి మండలానికి 108 వాహనాన్ని మంజూరి చేయడం అభినందనీయమని దీనికి సహకరించిన ప్రస్తుత జిల్లా వైద్యాధికారి సాంబశివరావుకు బొట్ల నరేష్ తో పాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు.