అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

  •  ఎస్ఐ వీ. గోవర్ధన్

అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎస్ఐ వీ. గోవర్ధన్ మండల ప్రజలను కోరారు. మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో పలు అంశాలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండల ప్రజలకు, ఆయా షాపుల యజమానులకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మండల ప్రజలు వ్యక్తిగత సమాచారాన్ని ఇతర వ్యక్తులకు తెలియజేయకూడదని ఆయన కోరారు. మన వ్యక్తిగత సమాచారం వేరే వ్యక్తులకు తెలిసినట్లయితే సైబర్ నేరాలు జరిగే ప్రమాదం ఉందని ఆయన తెలియజేశారు. మండల కేంద్రంలోని ఆయా కూడలిలలో షాపుల యజమానులు ఏకమై సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నట్లయితే ప్రజారక్షణకు ఈ కెమెరాలు నిఘా నేత్రాలుగా ఉపయోపడి నేరాలు, దొంగతనాలు, జరగకుండా దోహదపడుతాయన్నారు. ద్విచక్ర వాహనాలు నెంబర్ ప్లేట్ లేకుండా, సంబంధిత రిజిస్ట్రేషన్ కాగితాలు లేకుండా నడిపినట్లయితే వారిపై చట్టరితాన్య చర్యలు తీసుకోబడుతాయని ఆయన పేర్కొన్నారు. మండల కేంద్రంలోని వివిధ షాపుల ముందు విచ్చలవిడిగా వాహనాలు నిలుపకుండా క్రమపద్దతిగా వాహనాలు నిలిపే విధంగా చూడాలని ఆయన షాపు యజమానులకు తెలియజేశారు. శాంతిభద్రతలతో పాటు చట్టపరమైన విషయాలపై పోలీస్ శాఖకు మండల ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో శిక్షణ ఎస్ఐ పవన్ కుమార్, పోలీస్ సిబ్బంది, ఆయాషాపుల యజమానులు, మండల ప్రజలు, ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *