మండల కేంద్రంలో మిని క్రిస్మస్ వేడుకలు.
మండలంలోని మంగళవారం పలు గ్రామాల్లో మినిక్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని కారుణ్యజ్యోతి ఇంగ్లీషు మీడియం హైస్కూల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించగా పాఠశాల ప్రిన్సిపాల్ మేరి ఉషారాణి, కరస్పాండెంట్ మరియాదాస్ విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి మిఠాయిల పంపిణి కార్యక్రమం చేపట్టారు.క్రీస్తు పుట్టిన రోజు వేడుకలకు సమయాత్తం అవుతూ ఈ సెమి క్రిస్మస్ను జరుపుకోవడం జరుగుతున్నదని అన్నారు. ప్రేమ అంటేనే జీసెస్ అని, పొరుగు వారిని ప్రేమించడమే క్రైస్తవ మత సిద్ధాంతమని అన్నారు. మతం కన్న కూడా మానవ జీవన విధానం గురించి క్రైస్తవం తెలుపుతుందన్నారు. పొరుగు వారిని ఆదుకోవడం, సంఘ సేవ వంటి వాటిని ఏసు క్రీస్తు బోధించారని అన్నారు మండలంలోని ఆయా క్రిస్టియన్ సంఘాలలో ఘనంగా వేడుకలు కొనసాగాయి. ఈ కార్యక్రమంలో ఫాస్టర్లు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు