నల్లబెల్లి మండలంలో పెద్దపులి
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగుడెం నుండి కొండాపురం వెళ్లే పరిసరాల్లో పులి సంచారం ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో పరిసర గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అడుగు ముద్రలను సైతం గుర్తించడంతో మండలం లో చర్చ జరుగుతోంది. పులి సంచారానికి సంబంధించి భిన్న వాదనలు వ్యక్తం అవుతున్నాయి. అటవీ శాఖ అధికారులు విచారణ చేసి, చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు