వసూళ్లే లక్ష్యం…!

ములుగు ఆర్టీఏ కార్యాలయం అవినీతిమయం..

  • కార్యాలయంలో ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్‌
  • వసూళ్లను ప్రోత్సహిస్తున్నదెవరు..? ముందుండి వసూళ్లు చేస్తుందెవరు..?
  • “పీపుల్స్‌డైరీ” నిఘా టీమ్‌ పరిశీలనలో సంచలన విషయాలు వెలుగులోకి…

పీపుల్స్‌డైరీ-నిఘా టీం : ములుగు ఆర్టీఏ కార్యాలయంలో అక్రమ వసూళ్ల జోరు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఆ కార్యాలయానికి వెళ్తే నిలువుదోపిడీ తప్పదని, ప్రతీ పనికి మామూళ్లు చెల్లించాల్సిందేనని వాహనదారులు వాపోతున్నారు. నూతన వాహనాల రిజిస్ట్రేషన్‌లకు ఓ రేటు, వాహన ఫిట్‌నెస్‌లకు మరో రేటు, లైసెన్స్‌లకు ఇంకో రేటు ఫిక్స్‌ చేసిన అధికారి తను నియమించుకున్న ప్రైవేట్‌ అసిస్టెంట్‌తో వసూళ్లు చేపిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కార్యాలయంలో జరుగుతున్న అక్రమ వసూళ్లపై ‘‘పీపుల్స్‌ డైరీ పత్రిక’’ నిఘా టీమ్‌ గత 15 రోజులుగా ఆ కార్యాలయంలో జరుగుతున్న వసూళ్లపై ఆధారాలు సేకరించింది. ఆ కార్యాలయంలో ఏ సర్వీస్‌ కావాలన్నా ప్రభుత్వానికి చెల్లించే ఫీజు తోపాటు అదనంగా అధికారికి, కార్యాలయ సిబ్బంది కి ముడుపులు చెల్లించాల్సిందే అని తెలిసింది. ప్రత్యేకంగా ముడుపులు పుచ్చుకోవడం కోసం ఓ ప్రైవేట్‌ వ్యక్తిని కూడా ఆ అధికారి నియమించుకుని ఆ వ్యక్తి ద్వారానే వాహనదారుల నుండి లంచాలను కోడ్‌ రూపంలో వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం.

——————————-

ములుగు ఆర్టీఏ కార్యాలయంలో ఏం జరుగుతోంది?

ఏ సర్వీస్‌కు ఎంత (మామూళ్లు) వసూలు చేస్తున్నారు?
వసూళ్లు చేస్తుందెవరు..? చేయిస్తుందెవరు?
ప్రభుత్వ ఫీజు ఎంత? మామూళ్లు ఎంత?

పూర్తి వివరాలతో కూడిన సంచలన కథనం త్వరలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *