Hyderabad Metro : అర్ధరాత్రి దాకా మెట్రో.. వాటిల్లో ఉచితంగా ప్రయాణం.. హైదరాబాద్ వాసులకు న్యూ ఇయర్ గిఫ్ట్ మామూలుగా లేదుగా..
న్యూ ఇయర్ వేడుకలు హైదరాబాద్లో ఘనంగా జరుగుతాయి. గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ నగరం శర వేగంగా విస్తరించింది. ప్రపంచ స్థాయి కంపెనీలు హైదరాబాదులో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. దీంతో దేశంలోని వివిధ ప్రాంతాల చెందినవారు ఇక్కడ పనిచేస్తున్నారు.. ఫలితంగా హైదరాబాదు నగరం విశ్వ నగరంగా ఆవిర్భవించింది
Hyderabad Metro : ఒకప్పుడు హైదరాబాద్ నగరానికి చార్మినార్ ను ఐకానిక్ సింబల్ గా చూపించేవారు. ఇప్పుడు మాత్రం హైటెక్ సిటీ ఆ ప్రాంతాలను చూపిస్తున్నారు. సైబరాబాద్ నుంచి మొదలు పెడితే నానక్ రామ్ గూడ వరకు కొత్త సిటీగా పేర్కొంటున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీని డెవలప్ చేస్తామని చెప్తున్నారు. మొత్తంగా చూస్తే హైదరాబాద్ దేశానికే తలమానికంగా నిలిచే విధంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో ఇక్కడ జరిగే నూతన సంవత్సర వేడుకలను దేశం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది. జనం విందులు, వినోదాలు ఇతర సందడులతో ఉత్సాహంగా ఉంటారు కాబట్టి హైదరాబాద్ నగరవాసులకు తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర వేడుక గిఫ్ట్ ను అందించింది. నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31 న హైదరాబాద్ నగర వాసులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ వెల్లడించింది. హైదరాబాద్, రాచకొండ, హైబరాబాద్ పరిధిలో ఉన్న 500 కార్లు, 250 బైక్ టాక్సీలు హైదరాబాద్ నగర వాసులతో ఉచిత ప్రయాణం సాగించే అవకాశాన్ని కల్పిస్తాయి. అయితే మధ్యమధ్యలో ప్రమాదాలకు గురికాకుండా ఉండడానికి తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ వెల్లడించింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగర ప్రజలు మద్యం తాగి గాయాల పాలవుతున్నారని.. అందువల్లే తాము నిర్ణయం తీసుకున్నామని తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ ప్రకటించింది.