చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
నల్లబెల్లి: మండలంలోని బోలోనిపల్లి గ్రామానికి చెందిన రాగుల రాజయ్య , భద్రమ్మ దంపతులకు ముగ్గురు సంతానం ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు . రాజయ్య వృత్తిరిత్యా కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తాడు. రమేష్ (27 ) సంవత్సరాలు కులం రజక వృత్తి లారీ డ్రైవర్ గా పనిచేస్తూ త్రాగుడుకు బానిసై గత కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురై ఆరోగ్యం క్షీణించి ,అతని శరీరంలోని అంతర్గత అవయవాలు కాలెయం, ఊపిరితిత్తులు, కిడ్నీలు చెడిపోయి శుక్రవారం రోజున ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తండ్రి రాజయ్య ఫిర్యాదు మేరకు నల్లబెల్లి మండల ఎస్సై గోవర్ధన్ కేసు నమోదు చేశారు.