*ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను అభినందించిన వరంగల్ సిపి*
వరంగల్ మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రచారం చేపట్టిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను వరంగల్ పోలీస్ కమిషనర్ అభినందించారు. మత్తు పదార్థాల వినియోగం వలన కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం సంగెం జిల్లా పరిషత్తు హై స్కూల్ విద్యార్థులు డ్రాయింగ్ టీచర్ ఈశ్వర్ సహకారంతో సే నో టూ డ్రగ్స్ అనే నినాదం తో పనికి రాని కాగితాలతో రూపొందించిన ప్రచార సామాగ్రిని పోలీస్ కమిషనర్ సీపీ కార్యాలయంలో పరిశీలించి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ చిన్నారులు ప్రయత్నం అభినందనీయమని, పాఠశాల స్థాయి నుండి మత్తు పదార్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడంలో ఉపాధ్యాయులు కృషి చేయాలని పోలీస్ కమిషనర్ తెలిపారు.