GATE -2025 అడ్మిట్ కార్డులు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఐఐటీ (Indian Institute of Technology)ల్లో సహా ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(GATE 2025) అడ్మిట్ కార్డులు(GATE Admit Card 2025) విడుదల చేసినట్లు ఐఐటీ రూర్కీ (IIT Roorkee) వెల్లడించింది. గేట్ అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ లింక్‌ను https://goaps.iitr.ac.in/login సందర్శించండి. ఇక గేట్ 2025 పరీక్షలు ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదలైన విషయం తెలిసిందే. ఈ పరీక్షలను రోజుకు రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి 12.30 వరకు మొదటి సెషన్ పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం 4 రోజుల పాటు ఈ పరీక్షలు జరుగనున్నాయి. మొత్తం 30 సబ్జెక్టుల్లో ఈ పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షల ఫలితాలను(GATE 2025) మార్చి 19వ తేదీన విడుదల చేయనున్నట్లు సమాచారం.