నల్లబెల్లి ప్రభుత్వ ఉపాధ్యాయుల తీరే వేరు

నల్లబెల్లి ప్రభుత్వ ఉపాధ్యాయుల తీరే వేరు

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్ధుల చదువు గందరగోళంగా వుంది.మండల కేంద్రంలోని పాఠశాల అయినప్పటికీ అధికారుల పర్యవేక్షణ కరువైందనేది చెప్పగానే చెప్పినట్లు కనిపిస్తుంది . భావితరాల పౌరుల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ,ఉపాధ్యాయులే విద్యార్థుల భవిష్యత్తును గాలికి వదిలేయడం చూస్తుంటే ప్రజలు ముక్కున వేలుసుకుంటున్నారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన సమయాన్ని ఉపాధ్యాయులు యదేచ్ఛగా పాఠశాలలో తమ సొంత పనులకు వాడుకోవడం, స్కూల్లోనే షాపింగ్ లు చేయడం, చేస్తుంటే మండల ప్రజలు ,విద్యార్థుల తల్లిదండ్రులు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రైవేటు పాఠశాలలో ఫీజుల కట్టలేక , తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తుంటే. ప్రభుత్వ జీతం తీసుకుంటున్నటువంటి ఉపాధ్యాయులు సమయాన్ని ప్రభుత్వ సొమ్ము తీసుకుంటూ జీతం తీసుకుంటూ సమయాన్ని వృధా చేస్తూ తమ సొంత పనులకు వినియోగించుకోవడం పట్ల వీరి పై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం ఉందని చెప్పకనే చెప్పినట్లు కనిపిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *