Warangal Youth Dies By Suicide: ఆన్ లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి..
వరంగల్ వర్థన్న పేటలో ఘటన (వీడియో) ఆన్ లైన్ బెట్టింగ్ కు బానిసై అప్పుల పాలై ఎంతో మంది యువకులు ప్రాణాలను తీసుకుంటున్న ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. వరంగల్ జిల్లా వర్థన్న పేట మండలం ఇల్లంద గ్రామంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది.గ్రామానికి చెందిన రాజ్ కుమార్ ఆన్ లైన్ బెట్టింగ్ కు బానిసై అప్పులపాలయ్యాడు. రుణాలను ఎలా తీర్చాలన్నది అంతుపట్టకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాజ్ కుమార్.. ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.