తప్పిపోయిన కుమారున్ని తల్లికి అప్పగించిన పరకాల పోలీసులు
పరకాల :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్ఎం కొత్తపల్లి గ్రామానికి చెందిన బిల్లకంటి సుకోపాల సంపత్ రావు దంపతుల మతిస్థిమితంలేని కుమారుడు బిల్లకంటి విన్ను కరీంనగర్ లోని వికలాంగుల వసతి గృహంనుండి స్వగ్రామమైన కొత్తపల్లి కి వెళ్తున్న క్రమంలో పరకాల బస్టాండ్లో బస్సుకోసం వేచించుస్తున్న సమయంలో కుమారుడు కనిపించకపోయే సరికి దిగి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.వెంటనే స్పందించిన పరకాల పోలీసులు సీసీకెమెరాల ద్వారా చెక్ చేసి తక్కువ సమయంలోనే తల్లికి కుమారుడిని అప్పగించారు.అతి తక్కువ సమయంలోతమకుమారుడిని అప్పగించినందుకు సీఐ క్రాంతికుమార్,కానిస్టేబుల్ ఎస్.నాగరాజు,హోంగార్డ్ సుధాకర్ లకు తల్లి కృతజ్ఞతలు తెలిపారు