మానవ అక్రమ రవాణా అవగాహన పట్ల పోస్టర్ ఆవిష్కరణ
నర్సంపేట:
జాతీయ మానవ అక్రమ రవాణా అవగాహన దినోత్సవం సందర్భంగా స్వయంకృషి సోషల్ వర్క్ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో ఎఫ్ఎంఎం సోషల్ సర్వీస్ సొసైటీ సహకారంతో సి.ఐ. రమణమూర్తి,ఎస్ఐ రవికుమార్ లు శనివారం నర్సంపేట పోలీస్ స్టేషన్ లో మానవ అక్రమ రవాణా అవగాహన కు సంబందించిన కరపత్రాలు, వాల్ పోస్టర్లను ఆవిష్కరించి ప్రారంభించినారు.ఈ సందర్బంగా పట్టణ సి.ఐ రమణమూర్తి మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా అరికట్టుట కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.మానవ అక్రమ రవాణాకు మహిళలు, ఆడపిల్లలే గురైతున్నారని, అపరిచిత వ్యక్తుల ప్రవర్తన పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వారి ప్రవర్తన పట్ల అనుమానం వస్తే పోలీస్-100 హెల్ప్ లైన్ కు, చైల్డ్ హెల్ప్ లైన్-1098కు సమాచారం అందించి సహాయం తీసుకొని రక్షణ పొందాలని తెలిపారు.ఈ కార్యక్రమం లో కన్స్యూమర్ జిల్లా అధ్యక్షులు గిరగాని సుదర్శన్ గౌడ్, స్వయంకృషి సంస్థ నిర్వాహకులు బెజ్జంకి ప్రభాకర్,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.