ఆర్టీసీ ఉద్యోగులకు భోజనం నితరణ
డిపో మేనేజర్ ప్రసూనలక్ష్మీ
నర్సంపేట:
సంక్రాంతి పండుగ ప్రయాణికుల రద్దీ దృశ్య ఆర్టీసీ ఉద్యోగులకు భోజనం వితరణ చేసినట్లు డిపో మేనేజర్ ప్రసూనలక్ష్మీ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్రాతి పండుగ సందర్బంగా ప్రయాణికుల యొక్క రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల ఉద్యోగులకు భోజనం చేసే సమయం తక్కువ గా ఉంటుందని బావించి వారికి భోజన సౌకర్య వెసులుబాటు కొరకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వీసి,ఎం డి సజ్జనార్ ఆదేశాల మేరకు నర్సంపేట డిపో ఉద్యోగులకు భోజనం కొరకు ఆహార ప్యాకెట్లు అందజేశామన్నారు. ఈ ఆహార వితరణ ఆదివారం మరియు నెల 17న కూడా ఉంటుందని ఇట్టి అవకాశాన్ని ఉద్యోగులు సద్వినియోగం చేసుకోగలరని డిపో మేనేజర్ కోరారు. ఈ కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ భవానీ, అసిస్టెంట్ ఇంజనీర్ ప్రభాకర్, సెక్యూరిటీ హెడ్ వీరారెడ్డి,సూపర్ వైజర్ లు, డిపో ఉద్యోగులు పాల్గొన్నారు