ఆల్ఫాజోలం ముఠా గుట్టు రట్టు

*ఆల్ఫాజోలం ముఠా గుట్టు రట్టు*

*పౌల్ట్రీ ముసుగులో మత్తు దందా.

*5.35 కిలోల ఆల్ఫా జోలం స్వాధీనం.

*మిర్యాలగూడ జనవరి 12 పీపుల్స్ డైరీ):-*

ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాల నుంచి అక్రమంగా తెలంగాణ రాష్ట్రంలోకి ఆల్ఫాజోలం సరఫరా చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. తెలంగాణ ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలహాసన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణకు ఆల్ఫా జోలం సరఫరా చేస్తున్న ముఠాపై కొంతకాలంగా నిఘ పెట్టిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్, ఎస్ టి ఎఫ్ బృందాలు శుక్రవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా దర్శి నుంచి తెలంగాణకు కారులో ఆల్ఫా జోలం సరఫరా చేస్తుండగా పక్క సమాచారంతో నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడెంలో పట్టుకున్నారు. ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని ఉమామహేశ్వరం గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉపాధి కోసం కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాదుకు వచ్చి స్థిరపడ్డాడు ఇక్కడ పనిచేస్తూనే తన గ్రామంలో పౌల్ట్రీ ఫార్మ్ పెట్టాడు. ఆ వ్యాపారం ముసుగులో ఆల్ఫా జోలం తయారు చేస్తున్నాడు. ఆల్ఫా జోలాన్ని తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు చేరవేసి సొమ్ము చేసుకుంటున్నాడు.కాగా కొద్ది కాలంగా నిందితుడు కదలికలపై నిగాపెట్టిన అధికారులు పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి కోళ్ల ఫారం యూనిట్ పై దాడి చేసిన తెలంగాణ పోలీసులు ఆల్ఫాజోలం తయారీకి ఉపయోగించే యూనిట్ తో పాటు ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో 55 లక్షల రూపాయల విలువ చేసే 5.35 కిలోల ఆల్ఫా జోలం స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *