ట్రాక్టర్ బోల్తా పడి గ్రామపంచాయతీ వర్కర్ మృతి
*మిర్యాలగూడ జనవరి 12 పీపుల్స్ డైరీ):-*
పండగ పూట తీవ్ర విషాదం నెలకొంది. గ్రామపంచాయతీ ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి చెందారు. కుటుంబం ఇంటి పెద్ద దిక్కును కోల్పోయింది. ఈ హృదయ విషాద సంఘటన మాడుగుల పల్లి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం….. మండలంలోని ఆగా మోత్కూర్ గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ గంజి పాపయ్య (45), నామ అందాలు పనిచేస్తున్నారు. చిన్న గూడెం గ్రామంలో నీటిని సప్లై చేసి తిరిగి వస్తున్న క్రమంలో గ్రామంలోని కందిమల్ల వెంకటరెడ్డి దొడ్డి వద్దగల మూలమలుపుపై ప్రమాదవశాత్తు వాటర్ ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గంజి పాపయ్య స్పృహ కోల్పోగా, మరొక వ్యక్తికి స్వల్ప చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా గంజి పాపయ్య అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రి లో పొందుపరిచినట్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శి మోదుగు నాగేందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.