పండగపూట మంత్రి పొంగులేటికి తప్పిన పెను ప్రమాదం
పీపుల్స్ డైరీ:
ఖమ్మం: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ డ్డి ప్రయాణిస్తున్న కారు ఆదివారం రాత్రి ప్రమాదానికి గురైంది. వరంగల్ నుంచి ఖమ్మం వస్తుండగా తిరుమలాయపాలెం వద్ద ఒకే సారి రెండు టైర్లు పేలడంతో కారు అదుపుతప్పింది. కారు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన తర్వాత మంత్రి పొంగులేటి ఎస్కార్ట్ వాహనంలో ఖమ్మం చేరుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో మంత్రితోపాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, డీసీసీబీ డైరెక్టర్లు బొర్రా రాజశేఖర్, తుళ్లూరి బ్రహ్మయ్య ఉన్నారు.