*జాతీయ యువజన దినోత్సవం వివేకానంద స్ఫూర్తి.*
*-గోగుల రాణా ప్రతాప్ రెడ్డి.*
నల్లబెల్లి మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షులు తడుక వినయ్ గౌడ్ ఆధ్వర్యంలో ఈరోజు నల్లబెల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో స్వామి వివేకానంద విగ్రహం వద్ద జయంతి ఉత్సవం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమం జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ..
యువత వివేకనంద అడుగుజాడల్లో నడవాలని ఆయన మాటలే యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు.స్వామి వివేకానంద భారతదేశం గర్వపడే గొప్ప తత్వవేత్త మరియు ఆధ్యాత్మిక నాయకుడు.ప్రశ్నించే స్వభావం,జ్ఞానం తెలుసుకోవాలనే ఆసక్తి ఆయనను ప్రత్యేక వ్యక్తిగా తీర్చిదిద్దాయి అని అన్నారు.”స్వామిజీ ‘యువతే దేశ భవిష్యత్తు’ అనే నమ్మకంతో యువతను ప్రేరేపించారు.ఆయన జీవితంలో పాటించిన ఆదర్శాలు,ఉపదేశాలు నేటికీ కోట్లాది మందికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి”అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమార్ యాదవ్,బీజేపీ జిల్లా కార్యదర్శులు తడుక అశోక్ గౌడ్,గుడిపూడి రాధాకృష్ణ,పార్లమెంట్ కో-కన్వీనర్ జిల్లా నాయకులు బచ్చు వెంకటేశ్వర్ రావు,పెరుమాండ్ల కోటి,వల్లే పార్వతలు,ఈర్ల నాగరాజు,బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్,బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు విగ్నేష్ గౌడ్,గుర్రపు నరేష్,ఊటుకూరి చిరంజీవి,గుగులోతు తిరుపతి,దికొండ సునీల్,మురికి మనోహర్,కొండ్లె రమేష్,చుక్క శ్రీకాంత్,గుగులోతు రాందాన్,కామెర పాపయ్య,నాగరాజు,రాజేందర్,అంసింగ్,నవీన్,హరీష్,లోకేష్,బోట్ల ప్రతాప్,తడుక బీమ్, నాగపూరి సాగర్,బుచ్చిరెడ్డి, ఆవునురి భరత్,సిద్దు, సుజిత్ తదితరులు పాల్గొన్నారు.