పాఠశాల బస్సులను శుభకార్యలకు పంపిస్తే సీజ్ చేస్తాం
– జిల్లా రవాణాశాఖ అధికారి మహమ్మద్ సంధాని.
గణపురం, ఫిబ్రవరి 05 (పీపుల్స్ డైరీ): పాఠశాలలకు చెందిన బస్సులను యాజమాన్యాలు శుభకార్యాలకు వినియోగించినట్లయితే చట్టపరమైన చర్యలతో పాటు బస్సులను సీజ్ చేస్తామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా రవాణా శాఖ అధికారి సంధాని హెచ్చరించారు. బుధవారం వారు మాట్లాడుతూ… పిల్లలను పాఠశాలలకు తీసుకువచ్చేందుకు ఉపయోగించాల్సిన బస్సులను శుభకార్యాలకు, ప్రైవేటు కార్యక్రమాలకు పంపించడం తగదని వారు సూచించారు. వాహనదారులు అన్ని రకాల అర్హత పత్రాలు కలిగి ఉండాలని, వాహనాలకు సంబంధించిన అన్ని రకాల పన్నులను చెల్లించాలని ఆర్టిఏ నియమాలను పాటించాలని వారు తెలిపారు.ఆర్టిఏ నియమాలు పాటించకుండా వాహనం పట్టుబడితే 200 శాతం అదనపు రుసుము కట్టాల్సి ఉంటుందనీ జిల్లా రవాణాశాఖ అధికారి సంధాని వివరించారు