పార్టీ లైన్ లోనే అందరూ పని చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధంగా ఉండాలి
నాయకులకు కార్యకర్తలకు మధ్యలో విభేదాలుంటే నా ద్రుష్టికి తీసుకురావాలి
రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
మంగపేట, పిభ్రవరి 7 (పీపుల్స్ డైరీ) : మండల కేంద్రము లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం మండల అధ్యక్షులు మైల జయరాం రెడ్డి అధ్యక్షతన నిర్వహించగా ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధంగా ఉండాలి… పార్టీ లైన్ లోనే ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు. నాయకులకు కార్యకర్తలకు మధ్యలో విభేదాలుంటే నా ద్రుష్టికి తీసుకురావాలిని సీతక్క అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల మధ్యలోకి తీసుకెళ్లాలి. మండల అధ్యక్షులు ముఖ్య నాయకులు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి. గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి కానీ ఎక్కడా మాట్లాడకూడదు. పార్టీ కోసం పనిచేసిన వారిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీట్ చేయడం కోసం అందరూ కలిసి సమన్వయంతో పని చేయాలి. పార్టీ కోసం కష్టపడే వారికే స్థానిక సంస్థలలో టికెట్లు ఇవ్వడం జరుగుతుంది.
రాష్ట్రాన్ని10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన పాపాన పోలేదని సీతక్క ఎద్దేవా చేశారు. భూమి లేని రైతు కూలీలను అధ్వానంగా చూశారని, కోట్లు ఉన్న ఆసాములకు మాత్రం రైతు బంధు సాయం ఇచ్చారని మండిపడ్డారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుపేదల అభ్యున్నతికి దృష్టిలో పెట్టుకుని కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అమలు చేస్తోందని అన్నారు.ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తుండటంతో బీఆర్ఎస్ నేతలకు కడుపు మంటగా ఉన్నట్లుందని మంత్రి వర్యులు సీతక్కఅన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ తో పాటు బ్లాక్ కాంగ్రేస్ పార్టీ నాయకులు ఇర్సవడ్ల వెంకన్న, నాసిరెడ్డి సాంబశివరెడ్డి, వర్కింగ్ కమిటి అధ్యక్షులు చెట్టుపల్లి వెంకటేశ్వర్లు,యాణయ్య, ఇస్సార్ ఖాన్,జగన్మోహన్ రెడ్డి,చాద మల్లయ్య, సోషల్ మీడియా అధ్యక్షులు కర్రి నాగేందర్ బాబు, యూత్ అధ్యక్షులు మురుకుట్ల నరేందర్,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు