భారీ ఎన్కౌంటర్ 31 మంది మావోయిస్టులు ఇద్దరు జవాన్ల మృతి

భారీ ఎన్కౌంటర్ 31 మంది మావోయిస్టులు ఇద్దరు జవాన్ల మృతి

ఈ ఘటనలో పలువురు జవాన్ లకు మావోయిస్ట్ లకు గాయాలు

  • ఎదురు కాల్పుల్లో ఇద్ద‌రు జ‌వాన్లు దుర్మ‌ర‌ణం
  • కొనసాగుతున్న ఎదురుకాల్పులు
  • బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ సమీపంలో ఘటన


చర్ల,ఫిబ్రవరి 9(పీపుల్స్ డైరీ): చర్ల మండల సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. బీజాపూర్ జిల్లా నేషనల్‌ పార్క్‌ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 31 మంది మావోయిస్టులు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. మావోయిస్టుల కోసం డీఆర్‌జీ, ఎస్టీఎఫ్‌, కోబ్రా బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం . మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.పశ్చిమ బస్తర్‌ ప్రాంతంలో శుక్రవారం మావోయిస్టుల కదలికలకు సంబంధించి భద్రతా దళాలకు కీలక సమాచారం అందింది. దీంతో ఇంద్రావతీ నేషనల్‌ పార్క్‌ ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజామున భద్రతా దళాలు యాంటీ మావోయిస్టు ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ సమయంలో కాల్పులు మొదలు కావడంతో భద్రతా దళాలు ప్రతిస్పందించాయి. ఆ ప్రాంతం లో వార్తలు అందే సమయానికి కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం .
గత వారం బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. 2026 నాటికి మావోయిస్టులను కేంద్ర ప్రభుత్వం తుడిచిపెడుతుందని జనవరి 6న కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్న నేపథ్యంలో ఆపరేషన్లు వేగవంతమయ్యాయి.ఇటీవల ఒడిశా-ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లోని గరియాబంద్ జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. కుల్హాడీఘాట్ లో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో 20 మంది మావోయిస్టులు చనిపోయారు. తాజాగా ఆదివారం చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో బీజాపూర్ జిల్లాలో 31 మంది మావోయిస్టులు మరణించారు. కాగా, తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *