గిరిజన జాతర సమ్మక్క సారక్క జాతర లో సందడి 

గిరిజన జాతర సమ్మక్క సారక్క జాతర లో సందడి

అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఎదురు గుట్టల సమ్మక్క సారక్క జాతర

చర్ల , ఫిబ్రవరి 12 (పీపుల్స్ డైరీ): గిరి పుత్రుల ప్రదాన పండుగ సమ్మక్క సారక్క పండుగ ,వన దేవతలకు మొక్కలు తీర్చే సమ్మక్క సారక్క జాతర రానే వచ్చింది , ప్రతి రెండేళ్లకొకసారి మూడు రోజుల పాటు మేళ తాలాలతో డప్పు వాయిద్య తో గిరిజన సప్రదాయ బద్దం గా జరిగే అబరాసి బండలు చిన్న మేడారం ఎదురు గుట్టల సమ్మక్క సారక్క జాతర మొదటి రోజు బుదవారం ప్రారంభం అయినది, బుదవారం రాత్రి మునుపెన్నడు లేని విధంగా జిగేల్ మనిపించేల దివ్య కాంతులతో ఎదురుగుట్టల సమ్మక్క సారక్క జాతర అంగరంగ వైభవంగా ఎదురు గుట్టల ప్రాంగణం వెలుగులు విరజిమ్ముతూ కనిపించిన సమ్మక్క సారక్క ఆలయ ప్రాంగణం,. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లో రెండేళ్లకోకసారి జాతర చిన్న మేడారం గా ఎంతో ప్రసిద్ధి చెందినది ఈ ఏడాది సమ్మక్క సారక్క జాతర సందర్భంగా అన్ని ఏర్పాట్లు గణంగా జరుగుతున్నాయి .ఈ జాతర ఈ ఏడాది ఫిబ్రవరి 12 , 13,14, బుధ, గురు, శుక్ర వారాల్లో మూడు రోజుల పాటు వైభవంగా జరుపుకుంతున్నారు,,బుదవారం గుట్టదేవర ను గద్దె మీదకు తీసుకొచ్చుట , గురువారం సమూలమ్మ గుంట్టనుండి వనదేవతలు గద్దె మీదకు వస్తారు , శుక్రవారం గంగా స్త్నానం తో మొక్కుబడులు చెల్లించుకున్న అనంతరం దేవతలు వన ప్రవేశం చేస్తారు. సుమారు ఈ జాతరకు నాలుగు రాష్ట్రాల నుండి తెలంగాణ చేతిష్ ఘడ్, ఆంధ్రప్రదేశ్ , ఒడీస్సా నుండి భక్తులు వేలాదిగా తరలి వస్తారు. ఏడాది అన్ని ఏర్పాట్లు చేశామని సమ్మక్క సారక్క ఆలయ కమిటీ తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *