జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలి
- – ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
- – టి.ఎస్.జే.యూ నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే గండ్ర
పీపుల్స్ డైరీ, గణపురం: గణపురం మండలంలోని మాధవరావు పల్లి గ్రామంలో ప్రజలందరూ కలిసి ఎంతో భక్తి శ్రద్దలతో నిర్వహిస్తున్న బొడ్రాయి ప్రతిష్టాపన వేడుకల్లో బుధవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. అనంతరం జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను మార్యదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు నూతన కమిటీ సభ్యులకు శాలువా కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… జర్నలిస్ట్ ల సంక్షేమం కోసం నూతన కమిటీ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పావుశెట్టి శ్రీనివాస్, జయశంకర్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంతోష్, జిల్లా ప్రధాన కార్యదర్శి దొమ్మటి రవీందర్, సంయుక్త కార్యదర్శి కడపాక రవి, కోశాధికారి శేఖర్ నాని, ఈసి మెంబెర్ కె.దేవేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పం కిషన్, కొత్త వెంకన్న, సుంకరి సుధాకర్ రెడ్ది, ఓద్దుల విజయ అశోక్ రెడ్ది, మామిడాల విజయ్, తేలు కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.