ఓం నమ శివాయ…
– మండలంలో ప్రారంభమైన శివ పూజలు
పీపుల్స్ డైరీ, గణపురం: గణపురం మండలంలోని లక్ష్మారెడ్డి పల్లి గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర సహిత అభయాంజనేయ స్వామి దేవాలయంలో, అదేవిధంగా మండల కేంద్రంలోని శ్రీ నాగలింగేశ్వర స్వామి (రెడ్డిగుడి)లో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మర్మోగుతుంది. తెల్లవారు జాము నుండే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు,పూజలు నిర్వహిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయాన్ని ప్రత్యేక అలంకరణలో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. భక్తులు ఎంతో నియమ నిష్ఠలతో ఉపవాస దీక్షలు భూని స్వామి వారి సేవలో పాల్గొని ఈశ్వరుని కృపకు పాత్రులు అవుతున్నారు. ఆలయ నిర్వాహకులు మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక వసతులు చేపట్టారు.