యాదవ్ లు రాజకీయంగా ఎదగాలి

యాదవ్ లు రాజకీయంగా ఎదగాలి

  • ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చిన అండగా ఉంటాను
  • కిసాన్ పరివార్ సీఈవో డాక్టర్ వివేక్

మరిపెడ , మార్చి 02 (పీపుల్స్ డైరీ):

కిసాన్ పరివార్ సీఈవో డాక్టర్ వివేక్ గుండెపుడి గ్రామంలో రామాలయ దేవుడిని దర్శించుకొని అనంతరం యాదవుల కులదైవం అయినటువంటి గంగమ్మ గుడిని సందర్శించారు. ఈ సందర్భంగా కిసాన్ పరివార్ సీఈవో డాక్టర్ వివేక్ మాట్లాడుతూ గంగమ్మ తల్లి గుడికి సంబంధించిన విద్యుత్ సౌకర్యాలను అందిస్తానాని యాదవ్ లకు హామీ ఇచ్చారు. గుడికి సంబంధించిన తదితర కార్యక్రమాలకు హాజరై రానున్న రోజుల్లో యాదవుల సంబంధించిన ఏ కార్యక్రమాలకైనా అటెండ్ అవుతాను.ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికి కిసాన్ పరివారు అండగా ఉంటుందని యాదవులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా అదే దారిలో ఉన్న గౌడుల కులదైవం అయినటువంటి కాటమయ్య గుడినీ దర్శించుకున్నారు. అనంతరం సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాల వేశారు. ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి సవార్ లచ్చమ్మ దేవతను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా గ్రామ ప్రజలకు త్వరలో అందిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. గ్రామ కోఆర్డినేటర్ అయినటువంటి ప్రవీణ్ ఇంటికి వచ్చి గ్రామస్తులతో కొంతసేపు మాట్లాడి మిగతా కార్యక్రమాలకి హాజరు కావడానికి వెళ్లారు.ఈ కార్యక్రమంలో సర్వాయి పాపన్న విగ్రహ దాత, భయ్య సోమన్న మండల కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు గుండెపుడి గ్రామ కో ఆర్డినేటర్ సురబోయిన ప్రవీణ్ కుమార్ గ్రామ పెద్దలు కోట వెంకటరెడ్డి పాపిరెడ్డి మల్లారెడ్డి వడ్లకొండ బాబు పులుసు మల్లేశం ఈశ్వర్ డాక్టర్ పిచ్చయ్య, రేఖ వెంకన్న, బింగి రమేష్ యాదవ్, గడ్డం వెంకన్న యాదవ్ , బింగి లింగమంతులు యాదవ్ ముఖ్యంగా యువకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *