మండలంలో పేకాట రాయుళ్లు
– ఐదుగురి అరెస్ట్
– రూ. 7100 స్వాధీనం
గణపురం, మార్చ్ 3 (పీపుల్స్ డైరీ):: మండలంలో పేకాట రాయుళ్లు రెచ్చిపోతున్నారు. సోమవారం మండలంలో ఐదుగురి పేకాట రాయుళ్లను పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై రేఖ అశోక్ తెలిపిన ప్రకారం… మండలంలోని లక్ష్మారెడ్డి పల్లి గ్రామంలో సోమవారం భూపాలపల్లి సిసిఎస్ నిర్వహించిన రైల్లో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 52 పేక ముక్కలను, 7100 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన వారిలో లక్ష్మారెడ్డి పల్లి గ్రామానికి చెందిన మిరియాల మాధవరెడ్డి, గొర్రె రాజిరెడ్డి, మేడిపెల్లి రాజు, మొలుగూరి సమ్మయ్య, మొలుగురి సమ్మయ్య లను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రేఖ అశోక్ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.