ప్రమాదవశాత్తు కర్కపల్లి చెరువులో పడి ఒకరి మృతి
గణపురం, మార్చ్ 08 (పీపుల్స్ డైరీ): మండలంలోని కర్కపల్లి గ్రామానికి చెందిన తొర్రి సంపత్ (36) గేదెల కాపరి ప్రమాదవశాత్తు కరక పెళ్లి చెరువులో పడి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే… ఉదయం గేదెలను మేతకు తీసుకో వెళ్ళగా తిరిగి సాయంత్రం వేళలో గేదలు మాత్రమే ఇంటికి వచ్చాయి. గేదెల గేదెలతో పాటు సంపత్ రాకపోగా గ్రామస్తులు అతనికై చూడగా చెరువులో అతని కట్టే తేలడంతో చెరువులో వెతకగా మృతదేహమై తేలాడు. మృతుడు సంపత్ కి భార్య తొర్రి లక్ష్మి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు.