*యువత చూపు బీజేపీ వైపు.*
*-గోగుల రాణా ప్రతాప్ రెడ్డి.*
నర్సంపేట నియోజకవర్గంలో యువత చూపు బీజేపీ వైపు చూస్తున్నారని బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు.నల్లబెల్లి బీజేపీ మండల అధ్యక్షులు తడుక వినయ్ గౌడ్ ఆధ్వర్యంలో కొండైలుపల్లి గ్రామానికి చెందిన కొనకటి సుధాకర్ తో పాటు యువకులు బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు.ఈ సందర్బంగా రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోదీ ఇచ్చిన యువ భారత్ నినాదానికి నర్సంపేట నియోజకవర్గంలో ప్రాధాన్యత ఇస్తూ యువతకు బీజేపీ పార్టీలో పెద్దపీట వేస్తున్నామన్నారు. భవిష్యత్తులో అన్ని వర్గాల ప్రజల సహాకారంతో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ప్రణాళికలను సిద్ధం చేస్తునమన్నారు.రాబోయే స్థానిక ఎన్నికల్లో అధిక గ్రామాల్లో కాషాయ జెండాను ఎగరావేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పార్లమెంటు కో కన్వీనర్ కట్ల రామచంద్రారెడ్డి , జిల్లా కౌన్సిల్ మెంబెర్ బొద్దిరెడ్డి ప్రతాప్ రెడ్డి, దుంకదువ్వ రంజిత్ , మండల నాయకులు వల్లే పార్వతలు, రూరల్ మండల అధ్యక్షులు తనుగుల అంబేద్కర్ , జిల్లా యువ మోర్చ నాయకులు కొంకిస విగ్నేష్ గౌడ్ జూలూరి మనీష్ గౌడ్, కడియాల విజయ్ తదితరులు పాల్గొన్నారు.