నల్లబెల్లి మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షులు కాసార్ల నరసింహ రెడ్డి (ఆధాబ్ హైదరాబాద్) ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నూతన అధ్యక్షుడిగా రొట్టె సురేష్ (జన నిర్ణయం ), ప్రధాన కార్యదర్శిగా వల్లే రమేష్ (తరంగాలు) గౌరవ సలహాదారులుగా సట్ల రామ కృష్ణ , ఉపాధ్యక్షులుగా సుధాకర్ (జనం) కోశాధికారి గా కడియాల విజయ్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూఎంతో నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ప్రెస్ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.ప్రెస్ క్లబ్ అభివృద్ధి కోసం తమవంతుగా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.