నల్లబెల్లి మండలం కొండైలుపల్లె గ్రామానికి చెందిన అనుముల మహేందర్ రెడ్డి,అనుముల హరీష్ రెడ్డి దస్తగిరిపల్లె గ్రామానికి చెందిన బాబు ప్రశాంత్ బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు తడుక వినయ్ గౌడ్ అధ్యక్షతన బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి వారికి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బీజేపీ గెలుపు కోసం కృషి చేయాలని వారికి సూచించారు.ఈ సందర్బంగా గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ..స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహించిన బీజేపీ పార్టీ సిద్ధంగా ఉందన్నారు.గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలను ప్రజలుకు వివరించి పార్టీ బలోపేతానికి కృషిచేయాలన్నారు.నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని అదేవిధంగా నల్లబెల్లి మండలం కూడా నెంబర్ వన్ గా చేయాలంటే ప్రతి బీజేపీ కార్యకర్త ప్రతి ఓటర్ ను కలిసి కమలం పువ్వు గురించి నరేంద్ర మోడీ చేసే పథకాల గురించి ప్రజలకు వివరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కొండైలుపల్లె గ్రామ పార్టీ అధ్యక్షులు కొనుకటి సుధాకర్ రెడ్డి,దస్తగిరిపల్లె గ్రామ పార్టీ అధ్యక్షులు గుంపుల రాజు తదితరులు పాల్గొన్నారు.