రామాలయంలో వైభవంగా తొలి ఏకాదశి
– రామాలయానికి పోటెత్తిన భక్తులు
– ఆలయ అభివృద్ధికి నగదు అందజేత

గణపురం, జూలై 6 (పీపుల్స్ డైరీ): మండల కేంద్రంలోని శ్రీ పట్టాభి సీతారామ చంద్ర స్వామి ఆలయంలో ఆదివారం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 5 గంటలకే ఆలయ అర్చకులు ముసునూరు నరేష్ స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి స్వామివారికి పూజలు ప్రారంభించారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఆషాడం మాస శుక్ల తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని లు రామాలయ అభివృద్ధికిఆలయానికి భక్తులు పోటెత్తి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మండల కేంద్రం ఇచ్చిందా కీర్తిశేషులు సావిత్రి వెంకటేశ్వర్లు జ్ఞాపకార్థం వారి కుమారుడు అతిమూల దేవేందర్, మురళీధర్ యుగేందర్ లు రూ. 10,016ను ఆలయ అధ్యక్షులు తాళ్ల పెళ్లి గోవర్ధన్ గౌడ్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఆదిమూల మురళీధర్ మాట్లాడుతూ… మా కుటుంబం సభ్యుల తరఫునుండి శ్రీరామ భక్తులకు తొలి ఏకాదశి పండగ శుభాకాంక్షలు తెలుపుతూ మన ఊరి రామాలయం అభివృద్ధిలో నేను పాలుపంచుకోవడం నాకెంతో అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బండారు శంకర్, మూల శ్రీనివాస్ గౌడ్, బడికే స్వామి, మాదాసు అర్జున్, బూర రాజగోపాల్ మాదాసు బిక్షపతి, మాదాసు మొగిలి, దయ్యాల భద్రయ్య, పాండవుల భద్రయ్య, భక్తులు తదితరులు పాల్గొన్నారు.