బీరన్న బోనం ఎత్తిన ఎమ్మెల్యే గండ్ర
– గాంధీనగర్ లో ఘనంగా బీరన్న బోనాలు

గణపురం, జూలై 6 (పీపుల్స్ డైరీ): తొలి ఏకాదశి పర్వదినాన గొల్ల కురుమలు తమ కులదైవమైన బీరన్న స్వామికి భక్తి శ్రద్ధలతో బోనాలను సమర్పిస్తారు. ఆదివారం గణపురం మండలంలోని గాంధీనగర్ గ్రామంలో, భూపాలపల్లి పట్టణంలో జరిగిన బీరన్న స్వామి బోనాల ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. గాంధీనగర్ గ్రామంలో ఎమ్మెల్యేకు కాంగ్రెస్ నేతలు, గ్రామస్తులు, కురుమలు శాలువాలు కప్పి పూల బొకేలు ఇచ్చి స్వాగతం పలికారు. భూపాలపల్లిలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే డోలు వాయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతీక బోనాలు అని అన్నారు. ఈ బోనాల పండుగను అందరూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలను బీరన్న స్వామి చల్లంగా చూడాలని ఎమ్మెల్యే వేడుకున్నారు.